Categories: Telugus

ముఖ్యమంత్రి గారూ మనకి ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ మాధ్యమం కాదు

Published by

ఏ రకంగా చూసినా, విద్యాబోధనకి మాధ్యమంగా ఇంగ్లీష్ లేదా మరేదైనా విదేశీ భాష ఉపయోగించడం సరైన విధానం కాదు.

ప్రభుత్వ బడులలో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించి, ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి అని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇది సరి అయిన నిర్ణయమేనా అంటే, “కాదు”, అనే సమాధానం చెప్పవలసి ఉంటుంది. అయితే నేను ఈ నిర్ణయం తీసుకున్న వారి ఉద్దేశాలని తప్పుబట్టను. ప్రపంచంలో ఎన్నో పేద దేశాలలో, మరీ ముఖ్యంగా బ్రిటిష్ పాలన అనుభవించిన దేశాలలో, ఇంగ్లీష్ మీడియం గొప్ప, ఉద్యోగాలు రావాలీ అంటే ఇంగ్లీష్ మాధ్యమం తప్పనిసరి అనే ఒక బలమైన అభిప్రాయం ఉంది. ఆ కారణం వల్లనే మాజీ బ్రిటిష్ పాలిత దేశాలలోని తల్లి తండ్రులు తమ పిల్లలని ఇంగ్లీష్ మాధ్యమంలో చదివించడానికే ఇష్టపడతారు. అందుకనే ప్రభుత్వ బడులను మినహాయిస్తే ఈరోజున తెలుగు మాధ్యమాన్ని ఉపయోగించే బడులు దాదాపు లేవు. అయితే, ఈ విషయాన్నీ కొంత లోతుగా విశ్లేషణ చేస్తేనే కానీ, అసలు విషయం అవగాహన కాదు.

నేను ఈ అంశాన్ని భారతీయ సంస్కృతి, తెలుగు భాషా రక్షణ వంటి అంశాలతో జోడించ దలుచుకోలేదు. “మన పిల్లలకి చదువు బాగా రావాలీ అంటే మాధ్యమంగా ఏ భాష ఉండాలి?” అనేది మాత్రమే, నాకు ముఖ్యం

ఈ అంశం మీద పూర్తి అవగాహన రావాలీ అంటే, మనం కొన్ని కీలకమైన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి

  1. ఉద్యోగాలు రావాలీ అంటే ఇంగ్లీష్ తప్పనిసరా, కాదా?
  2. ఇంగ్లీష్ రావాలీ అంటే ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యని నేర్చుకోవడం తప్పనిసరా?
  3. విద్యాబోధన మాధ్యమంగా మాతృభాష ఉండాలా? ఇంగ్లీష్ ఉండాలా? ఈ అంశం మీద జరిగిన పరిశోధనల ఫలితాలు ఎం చెప్తున్నాయి?

ఇప్పుడు ఒక్కో అంశాన్ని విశ్లేషిస్తాను. అప్పుడు మీకు ఈ అంశం మీద ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది

ఉద్యోగాలు రావాలీ అంటే ఇంగ్లీష్ తప్పనిసరా కాదా?

నచ్చినా నచ్చకపోయినా ప్రస్తుత పరిస్థతి ఇంచు మించు అలానే ఉంది. చిన్న చిన్న ఉద్యోగాలని పక్కనబెడితే, మెరుగైన స్థాయి ఉద్యోగాలన్నిటికీ ఇంగ్లీష్ ప్రస్తుతం తప్పని సరిగా మారింది. అయితే ఇంగ్లీష్ తపనిసరి అవ్వడానికి ఆ ఉద్యోగాల స్వభావం కారణం కాదు, మన వ్యవస్థే అందుకు కారణం. ఇవే ఉద్యోగాలని ఎన్నో ఇతర అభివృద్ది చెందిన దేశాలలో వారి వారి మాతృభాషలలోనే చేస్తున్నారు. ఉదాహరణకి చైనా, జపాన్, ఇస్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీ ఇలా ఎన్నో దేశాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. వారి విద్యాబోధన అంతా వారి వారి మాతృభాషలలోనే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సమస్య మన వ్యవస్థే కానీ, ఉద్యోగాల స్వభావం కాదు.

ఇంగ్లీష్ తపనిసరి అవ్వడానికి ఆ ఉద్యోగాల స్వభావం కారణం కాదు, మన వ్యవస్థే అందుకు కారణం

అయితే నేను ప్రస్తుతానికి ఈ విషయం మీద లోతైన చర్చ చేయ్యదలుచుకోవడం లేదు. కారణం ఏదైతేనేం, కనీసం ప్రస్తుతం మెరుగైన ఉద్యోగాలు రావాలీ అంటే, ఇంగ్లీష్ భాష మీద ఎంతో కొంత పట్టు ఉండటం తప్పని సరి. ఇప్పుడు ఇక రెండో అంశంలోకి వెళ్దాం

ఇంగ్లీష్ రావాలి అంటే ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యని నేర్చుకోవడం తప్పనిసరా?

నిస్సందేహంగా కాదు. ఇందుకు మనకు లక్షల సంఖ్యలో ఉదాహరణలు కనబడతాయి. ఈ రోజున అమెరికా వంటి దేశాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న ఎందరో, తెలుగు భాషలో విద్యని నేర్చుకున్నవారే. అలానే మనలో ఎందరమో ఒకటి కన్నా ఎక్కువ భాషలు మాట్లాడగలం. ఉదాహరణకి హైదరాబాద్ లో ఎందరో హిందీ మాట్లాడగలరు, మరి వారందరూ హిందీ మాధ్యమంలో చదువుకున్నారా? లేదు కద. కనుక ఒక భాష మాట్లాడటం రావాలీ అంటే విద్యాభ్యాసానికి ఆ భాషని మాధ్యమంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కనుక, ఇంగ్లీష్ రావాలీ అంటే ఇంగ్లీష్ మాధ్యమం తప్పనిసరి కాదు. అందుకు పాఠశాల స్థాయిలోనే “స్పోకెన్ ఇంగ్లీష్” నేర్పితే సరిపోతుంది. ఇలా చేస్తే బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ ని ఉపయోగించకుండానే, ఇంగ్లీష్ భాషని పిల్లలకు నేర్పవచ్చు. మరి సాంకేతిక పదజాలం సంగతి ఏమిటి, అనేది మీ ప్రశ్న అయితే, అందుకు సాంకేతిక పదాలని తెలుగు, ఇంగ్లీష్ లలో నేర్పితే సరిపోతుంది.

అవసరం ప్రాధమిక స్థాయిలో ఇంగ్లీష్ లో మాట్లాడటం/రాయడం. పరిష్కారం చిన్నతనం నుండే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పడం

ఇక్కడ ఇంకో కీలకమైన అంశం కూడా మనం తెలుసుకోవాలి. మాతృభాషపై పట్టు లేకుండా, వేరే ఏ భాషా నేర్చుకోవడం కుదరదు. అంటే ఇంగ్లీష్ భాష రావాలన్నా మాతృభాషపై పట్టు ఉండటం తప్పనిసరి. ఈ అంశం మీద జరిగిన అన్ని పరిశోధనలూ ఇదే విషయాన్ని తేల్చి చెప్తున్నాయి. ఐఖ్య రాజ్య సమితికి (UNO) చెందిన యునెస్కో (UNESCO) సంస్థ వారు ఈ విషయంపై చేసిన పరిశోధనలో ఇదే విషయం నిరూపించబడింది. ఈ కారణం వల్లనే చిన్నప్పటి నుండీ ఇంగ్లీష్ మీడియంలోనే చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసిన చాలా మందికి ఇంగ్లీష్ రావడంలేదు. పోనీ వీళ్ళకి తెలుగైనా బాగా వస్తుందా అంటే అదీ రాదు. అంటే ఇంగ్లీష్ చదువుల వలన ఇంగ్లీష్ రాకపోగా, తెలుగు కూడా రావడం లేదు. అంటే అసలు ఏ భాష మీదా పట్టు లేని కోట్ల మందిని మన విద్యావ్యవస్థ నేడు తయారు చేస్తోంది. మరి భాష రాక పోతే జ్ఞానం ఎలా సంపాదిస్తారు? ఇది మన దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో ఒకటి

విద్యాబోధన మాధ్యమంగా మాతృభాష ఉండాలా? ఇంగ్లీష్ ఉండాలా? ఈ అంశం మీద జరిగిన పరిశోధనలు ఏం చెప్తున్నాయి?

ఇక ఆఖరిది, ముఖ్యమైనది అయిన మూడో అంశానికి వద్దాం. విద్యాబోధన యొక్క ముఖ్యమైన లక్ష్యం అధ్యాపకుడు బోధిస్తున్న అంశం పిల్లలకి అర్ధం కావడం. కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచించినా అందుకు మాతృభాషే మంచిది అని తేలికగానే అర్ధమవుతుంది.

UNESCO, UNICEFలు ప్రచురించిన పరిశోధనా పత్రాలు కూడా విద్యాబోధనకు మాతృభాషే ఉత్తమం అని తేల్చి చెప్తున్నాయి

ఈ అంశం మీద జరిగిన అన్ని పరిశోధనలూ ఇదే విషయాన్ని తేల్చి చెప్తున్నాయి. ఐఖ్య రాజ్య సమితికి (UNO) చెందిన యునెస్కో (UNESCO) అలానే యూనిసెఫ్ (UNICEF) సంస్థలు ఈ అంశం మీద చేసిన విస్తృత పరిశోధనలు, ప్రచురించిన పరిశోధనా పత్రాలూ ఇదే అంశాన్ని, సందేహానికి ఏమాత్రం తావు లేకుండా నిరూపిస్తున్నాయి. “Enhancing Learning of Children from Diverse back grounds”, “The impact of language policy and practice on children’s learning: Evidence from Eastern and Southern Africa” అనే పేర్లతో విడుదల అయిన ఈ పరిశోధనా పత్రాలని ఎవరైనా అంతర్జాలంలో (ఇంటర్నెట్) ఉచితంగా పొందవచ్చు.

నా పరిశోధన

నేను స్వయంగా కూడా ఈ అంశం మీద లోతైన పరిశోధన చేశాను. నా ఈ పరిశోధన కోసం నేను 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న అన్ని దేశాలనీ (168) పరిగణలోకి తీసుకున్నాను. నా పరిశోధనలో బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన అంశాలని ఇప్పుడు మీ ముందు ఉంచుతాను.

2017 వరకూ ఇవ్వబడ్డ నోబెల్ బహుమతులలో (నోబెల్ శాంతి బహుమతి మినహా) 98% పైగా మాతృభాషలో చదువు చెప్పే దేశాలకి చెందిన వారే గెలుచుకున్నారు

  1. మనం ఎలా అయితే ఇంగ్లీష్ భాషని విద్యలో మాధ్యమంగా ఉపయోగిస్తున్నామో, అలానే బ్రిటిష్ వారి పాలనకు గురి అయిన ఎన్నో ఇతర దేశాలు కూడా ఉపయోగిస్తునాయి. అలానే ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగల్ వలస పాలన అనుభవించిన దేశాలు ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీసు భాషలని ఉపయోగిస్తున్నాయి.
  2. వలస పాలనకు గురి కాకుండా విదేశీ భాషను మాధ్యమంగా ఉపయోగించే దేశాలు ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, ఇథియోపియాలు మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ లు భారత్ ప్రభావం వలన అలా చేస్తుంటే, ఇథియోపియా మిగిలిన ఆఫ్రికా దేశాల ప్రభావం వలన. వలస పాలనకు గురికాని ఏకైక ఆఫ్రికా దేశం ఇథియోపియా. నిజంగానే ఇంగ్లీష్ మాధ్యమం ఉపయోగించడం వలన ఏమైనా ప్రత్యెక ప్రయోజనాలు ఉండి ఉంటె, ఇప్పటికే ఎన్నో ఇతర దేశాలు ఆ పని చేసేవి. కాబట్టి విదేశీ భాషని విద్యలో ఉపయోగించడానికి కారణం పరాయి పాలనే కానీ, ఆ భాషల యొక్క గొప్పతనం కాదు
  3. ధనిక దేశాలైన అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాండ్లు మాత్రమె కాక, నార్వే, స్వీడన్, లక్సెంబర్గ్ లాంటి అతి చిన్న దేశాలు కూడా విద్యాబోధనకి మాతృభాషనే ఉపయోగిస్తున్నాయి
  4. 2017 వరకూ ఇవ్వబడ్డ నోబెల్ బహుమతులలో (నోబెల్ శాంతి బహుమతి మినహా) 98% పైగా బహుమతులు మాతృభాషలో విద్యని బోధించే దేశాలకి చెందిన వారే గెలుచుకున్నారు
  5. కొనుగోలు శక్తీ ఆధారిత తలసరి ఆదాయం దృష్ట్యా ప్రపంచంలోని మొదటి 30 దేశాలలో 28 దేశాల వారు పిల్లలకి చదువు చెప్పడానికి మాతృభాషనే వాడుతున్నారు. మిగిలిన రెండు దేశాలైన సింగపూర్, హాంగ్ కాంగ్ లు పేరుకు దేశాలే అయినా వాటి జనాభా మన ముంబై అంత కూడా ఉండదు. కనుక అక్కడి విధానాలు మన వంటి పెద్ద దేశాలకి పనికి రావు.
  6. కొనుగోలు శక్తీ ఆధారిత తలసరి ఆదాయం దృష్ట్యా ప్రపంచంలోని చివరి 25 దేశాలూ పిల్లలకి చదువు చెప్పడానికి విదేశీ భాషనే వాడుతున్నాయి. అంటే కేవలం పేద దేశాలు మాత్రమే విదేశీ భాషని ఉపయోగిస్తాయి
  7. ప్రపంచీకరణకు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అనే భావన ప్రజలలో బలంగా ఉంది. కానీ అందులో నిజం లేదు. KOF గ్లోబలైజేషన్ సూచీ – 2018 లో భాగమైన మొదటి 50 దేశాలలో 48 మాతృభాషనే వాడుతున్నాయి. ఆ మిగిలిన రెండూ సింగపూర్ (జనాభా సుమారు 60 లక్షలు), మాల్టా (జనాభా సుమారు 5 లక్షలు). ఇంగ్లీష్, ఇంగ్లీష్ అని ఇంతలా తపించిపోయే మనది 101వ స్థానం. కనుక ప్రపంచీకరణకు కావాల్సింది మాతృభాషే తప్ప విదేశీ భాష కాదు
  8. ఆధునిక పరిశోధనలు చెయ్యడానికి ఇంగ్లీష్ తప్పనిసరి అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. “గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్”, “బ్లూమ్బెర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్” అనేవి శాస్త్ర సాంకేతిక రంగాలలో వివిధ దేశాలకు వాటి ఆవిష్కరణల సామర్ధ్యాన్ని అనుసరించి ప్రతీ సంవత్సరం ర్యాంకులు ఇస్తాయి. ఈ జాబితాలలో మొదటి 40 – 50 స్థానాలలో ఉండే 90% పైగా దేశాలు మాతృభాషలోనే పిల్లలకు చదువు చెప్తున్నాయి. ఉదాహరణకి “గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ – 2018” లో మొదటి స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ “బ్లూమ్బెర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ – 2018” లో మొదటి స్థానంలో నిలిచిన దక్షిణ కొరియా మాతృభాషనే ఉపయోగిస్తున్నాయి

ఇటువంటి పరిశోధనల ఫలితంగా జాంబియా, టాంజానియా, ఘానా వంటి మరెన్నో ఆఫ్రికా దేశాలు మెల్లగా విదేశీ భాషని వదిలి మాతృభాష విద్యాబోధన మొదలు పెడుతుంటే, మన దేశంలో ఇంకా ఇంగ్లీష్ మాధ్యమమే గొప్ప అనుకుని, ఉన్న మాతృభాష పాఠశాలలని కూడా ఇంగ్లీష్ మాధ్యమంలోకి మార్చడం నిజంగా దురదృష్టకరం. ఇది ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాదు. కొంత కాలం క్రితం ఉత్తర ప్రదేశ్ లో కూడా  ఇలానే ఎన్నో ప్రభుత్వ బడులను ఇంగ్లీష్ మాధ్యమంలోకి మార్చారు.

ఏ రకంగా చూసినా, విద్యాబోధనకి మాధ్యమంగా ఇంగ్లీష్ లేదా మరేదైనా విదేశీ భాష ఉపయోగించడం సరైన విధానం కాదు. ఇంగ్లీష్ అవసరం అనుకుంటే ముందే చెప్పినట్లు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పితే సరిపోతుంది. ఇది ఎంతో మంది జీవితాలని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం కనుక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, తమ నిర్ణయాన్ని పునరాలోచించాలి అని కోరుకుంటున్నాను

గమనిక:
1. ఇక్కడ వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు రచయిత యొక్క అభిప్రాయాలు మరియు PGurus యొక్క అభిప్రాయాలను తప్పనిసరిగా సూచించవు లేదా ప్రతిబింబించవు.

Ranjith Vadiyala

Independent Researcher, having interest in history / education / contemporary issues related to liberal / modern thought and their effects on Bharathiya Samskruthi.

View Comments

  • ప్రజలు ఆశించేది ఉద్యోగాలు, ఇంగ్లీష్ కాదు.... ఉన్నత విద్యలో, ఉద్యోగ అవకాశాళ్ళలొ, కోర్టుళ్ళలొ ప్రభుత్వం ఒకవైపు ఇంగ్లీషును ప్రోత్సాహిస్తొంది మరొకవైపు ప్రజలు ఇంగ్లీషుని కోరుకుంటున్నారని చెబుతొంది.

  • The writer’s views are far removed from reality. In AP only government schools teach in Telugu Medium whereas in all private schools the medium of instruction is in English. Thus only students, who can’t afford private schools go to government schools to study in Telugu medium. All advocates of Telugu medium should first practice what they preach by sending their kin to Government Schools. The Telugu equivalents of several technical words are quite tongue twisters and even die hard Telugu supporters can’t make out anything out of those words. See some examples:
    సాంతత్య సమీకరణ
    వాయుగతిక ఉత్థానవేగం
    తలతన్యతాబలం
    సంపీడనబలం
    వర్ణపటము
    ప్రచోదనము
    బలయుగ్మము
    What use of these tongue twisters?

    • మీరు వ్యాసం చదివారనే అనుకుంటున్నాను. నేను తెలుగు మాధ్యమాన్ని సిఫారసు చెయ్యడం లేదు, మాతృభాషని చేస్తున్నాను. అది కూడా శాస్త్రీయ కారణాల వలన.

      ఇక మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనే ప్రశ్నకు
      అవకాశం ఉన్న సమాధానాలు

      1. ప్రైవేట్ బడిలో ఇంగ్లీష్ మీడియం

      2. ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియం

      3. ప్రభుత్వ బడిలో తెలుగు మీడియం

      4. చదువుకునే పిల్లలు లేరు

      5. అసలు పిల్లలు లేరు

      వీటిలో నా సమాధానం ఏదైనా, యునెస్కో, Unicef వారి పరిశోధనా ఫలితాలూ మారవు, నేను చూపిన ఇతర గణాలంకాలూ మారవు. ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది వదిలి, ఏం చెప్తున్నారు అనే దానిపై ద్రుష్టి పెడదాం.

      ఇక నా సమాధానం

      ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం > ప్రభుత్వ తెలుగు మీడియం > ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం

      ప్రైవేట్ తెలుగు మీడియం వస్తే అక్కడే చేర్చుతాను. అప్పటిదాకా ప్రైవేట్ ఇంగ్లీష్ మెడియమే గతి.

      అవసరం ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాధ్యమం కాదు. అందుకు ఇంగ్లీష్ భాష నేర్పితే చాలు. మాధ్యమం అవసరం లేదు. ప్రభుత్వాలు ప్రైవేట్ బడులలో తెలుగు మీడియం ఎలా తేవాలా అని ఆలోచించాలి.

      • మీ మాతృభాష తెలుగు కాబట్టి మీ సిఫార్సు తెలుగు మీడియం అనే భావించాలి. భారతదేశంలో మాతృభాషలను బతికించే బాధ్యత పేద వర్గాల మీదే ఉంటే సంతోషం. ఈ టాపిక్ పై లెక్చర్లు దంచే మేధావులందరు వారి సంతానాన్ని ముందుగా తెలుగు మీడియం చదివించి మార్గదర్శకులు కావాలని నా ప్రార్థన. వీరు డిమాండ్ చేస్తే నారాయణ చైతన్య వంటి కూలి బడులు తెలుగు మీడియం లేదా ఏ మీడియం లోనైన బడులు తెరుస్తాయి. It is a simple matter of supply and demand. Therefore, it is time for all higher strata to demand Telugu medium in private schools in view of UNESCO and UNICEF research on benefits of teaching in mother tongue to benefit their wards. Then, obviously, their servant maids, cooks, drivers etc. will follow them in adopting mother tongue as medium for their children too.

        • 3 comments- one - the way forward is that private schools should impart education in telugu medium in subjects such as history, geography,civics.
          2. Spoken English and hindi should be made mandatory in all schools.
          3. Governments across India should get their acts together and design curriculum in graduation and post graduation such as MBBS ETC.
          4. jobs across andhra should make it mandatory for employees to know conversational Telugu.

        • దయచేసి మరో సారి వ్యాసం చదవండి. ఇది భాషా పరిరక్షణ, సంస్కృతి రక్షణ అంశం కాదు అని చాలా స్పష్టంగా రాశాను.

          ఇక మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారూ అనే ప్రశ్నకు ముందే సమాధానం చెప్పాను.

    • ఆ భార్య కేవలం మాజీ బ్రిటిష్ వలస దేశాల ప్రజలకే ఎందుకు కావాలి?

  • Can you cite 3 text books one each fr master's course in Engineering , sciences and management in telugu which are available plenty in german, chinese and French and on par with current standards The issue is not about spoken language which one can learn even by seeing films. it's about getting mastery over the subject fr which a wide range of references texts ,articles books are required to be read and mastered.. If what you have mind is ultimately train youth for Appsc exams what you suggested is fine. But for gaining competitiveness and capabity english medium education is vital. It's not anything to do with subordination. It's a measure to gain competitiveness. Pl let CM do his job who is doing it fine. Fr all long winding theories that make no sense we already have TDP Janasena and some part of BJP who are already providing abundance on it

    • 1. Texts that can be translated to German, French, Hebrew etc can also be translated to Telugu. Govt should di it

      2. Even if that is not the case, we would still need only English and NOT medium. That is the title of this article. Also I have mentioned that twice in the article. Hope you have read the article before commenting.

  • ఐతే జీవనోపాధి సంపాదించుకోవడానికి ఆంంగ్లభాషా ప్రావీణ్యం తప్పనిసరైన ప్రస్థుత వాతావరణం ఉన్నంతకాలం సామాన్య ప్రజల ఆంగ్లభాషా వ్యామోహాన్ని, తదుపరి ఆమాధ్యమ వ్యామోహాన్నీ వదిలించలేము. ఈవాతావరణాన్ని మార్చాలంటే ప్రభుత్వ నియామకాలకు తెలుగులో ప్రాధమిక పరిజ్ఞానాన్ని తప్పనిసరి అర్హతగా చేయాలి. అలాగే భాషను అధికార భాషగా అభివృద్ధిచేసుకోవాలి, అమలుచేయాలి. ఈపని మన ప్రభుత్వాలతో చేయించలేమా?

Recent Posts

An invitation to the Gods to Sin

Ayahuasca: Sacred Amazonian plant medicine Heaven is for luxuriating, Hell is for regretting and Earth…

28 mins ago

MHA extends AFSPA in parts of Arunachal and Nagaland for 6 months

MHA took the step following a review of the law-and-order situation in Nagaland, Arunachal Pradesh…

12 hours ago

Controversial police officer Sanjiv Bhatt convicted for 20 years for planting narcotics to arrest an Advocate in 1996

In a second conviction, sacked IPS Sanjiv Bhatt was sentenced to 20 years imprisonment for…

15 hours ago

Drugs Munnetra Kazhagam (DMK) – Deriving political capital from illicit trafficking

Stranglehold of drug traffickers on political systems and their links to the entertainment industry An…

16 hours ago

Denied ticket, Erode MP Ganeshamurthi attempted suicide, and dies

Erode MP A Ganeshamurthi, who consumed poison tablets over denial of ticket, passes away at…

17 hours ago

This website uses cookies.