2 POSTS
సత్య దోసపాటి అమెరికా లో స్థిరపడిన ఒక ప్రముఖ హిందూ కార్యకర్త. ఈయన భారతదేశానికి, అమెరికాకు చెందిన అనేక కీలకమైన విషయాలలో పని చేశారు. భారత దేశపు ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ లలో పేపర్ ప్రింట్ రావడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నికల సమయంలో అనేకమంది మైనారిటీల ను సంఘటితం చేసి ట్రంప్ కు మద్దతు తెలిపాడు. అమెరికాలో సోనియా గాంధీకి చెందిన అనేక కోర్ట్ కేసులను ఎదురొడ్డి నిలిచారు. వెస్ట్ బెంగాల్ లో అనేకమంది పేద బాలికల అపహరణ,లవ్ జిహాద్, తదనంతరం వారిని బానిసలుగా వేశ్యా గృహాలకు అమ్మేసే రాకెట్ పై పోరాటం చేసారు. ఈయన ఇచ్చిన "ప్లండర్ అఫ్ ఇండియా బై సోనియా గాంధీ" అనే ప్రెజంటేషన్ ను 2 లక్షల మంది పైగా వీక్షించారు. 2007 లో హిందూ దేవాలయాలలో మత మార్పిడులను నిషేధించాలని అప్పటి ముఖ్య మంత్రి వై.ఎస్.ఆర్ ప్రభుత్వంపై పోరాటం చేసారు. అమెరికాలో జంతు హక్కులపై పోరాటం చేసారు. ఈయన ఐఐటీ మద్రాస్ లో పట్టభద్రుడయ్యాడు, వృత్తి రీత్యా ప్రస్తుతం అమెరికాలో టెలికాం ఇండస్ట్రీ లో ఉద్యోగం చేస్తున్నారు.