ఆంధ్రాలో రెడ్డి, కమ్మ కులాల రాజకీయ ఆధిపత్య పోరు

ఆంధ్రలో రాజ్యాధికారం  అనేక సంవత్సరాలుగా కేవలం  రెడ్డి, కమ్మ కులాలే మధ్యే ఉంటోంది

ఆంధ్రాలో రెడ్డి, కమ్మ కులాల రాజకీయ ఆధిపత్య పోరు
ఆంధ్రాలో రెడ్డి, కమ్మ కులాల రాజకీయ ఆధిపత్య పోరు

ఆంధ్రాలో బీజేపీ పాగా వేయాలనుకుంటే ఈ రెడ్డి, కమ్మ కులాల మధ్య జరిగే రాజకీయ  ఆధిపత్య పోరు అనే చట్రంలో చిక్కకుండా జాగ్రత్తగా ఉండగలగాలి.

2019 కేంద్రంలో బీజేపీ అద్భుతమైన గెలుపు తరువాత “అభివృద్ధి పథంలో పయనిస్తున్న భారత్ రాచరిక, వంశపారంపర్య, కుల రాజకీయాలకు అతీతంగా ఉండాలి” అని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, కేరళ తప్ప భారత దేశంలో ఉన్న మిగతా అన్ని ప్రాంతాలకు ఈ వ్యాఖ్యలు సరిపోతాయి. ఎందుకంటే పై మూడు రాష్ట్రాలలో రాజకీయాలు వంశపారంపర్య, కుల, రాచరిక వ్యవస్థ ఆధారంగా నడుస్తున్నాయి.  ఆంధ్రాలో పుట్టి పెరిగిన నేను ఇక్కడ  కుల రాజకీయాలు నేటికీ బలంగా ఉన్నాయని ఘంటాపథంగా  చెప్పగలను. ఆంధ్రా  2019 లో ఎన్నికలలో పాల్గొన్న మూడు రాజకీయ పార్టీలు రెడ్డి, కమ్మ, కాపు అనే  3 కులాలకు ప్రాతినిధ్యం వహించాయి.

ఆంధ్రలో రాజ్యాధికారం  అనేక సంవత్సరాలుగా కేవలం  రెడ్డి, కమ్మ కులాలే మధ్యే ఉంటోంది. రాజకీయాలలో అనేకమంది  ఈ రెండు కులాలకు చెందిన వారు చేరి బాగా డబ్బు సంపాదించారు. ఈ విషయాన్ని గమనించిన కాపు కులం వారు ఈ మధ్యనే ఒక పార్టీ పెట్టి రాజకీయ ప్రవేశం చేసారు. ఈ రెండు కులాల ఆధిపత్య పోరు ప్రభావమే రాష్ట్రం రెండు ముక్కలవడం. ఈ పోరు ప్రభావం వల్ల తెలంగాణలో అనేకమంది తమ అభివృద్ధికి కావలసిన నిధులు ప్రభుత్వం నుండి అందడంలేదు అనే అభిప్రాయంతో ఆంధ్ర  నుండి విడిపోయారు. ఈ విభజన సమయంలో చేసుకున్న తీర్మానాలు వాటి ఫలితం నేడు ఆంధ్ర ప్రభుత్వపు ఖజానాలో నిధులకు కొరత ఏర్పడింది.

ఈ కులాల ఆధిపత్య పోరు, వాటి ప్రభావాన్ని నేను మూడు దశాబ్దాల క్రితమే గమనించాను. నా టీనేజ్ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమ్మ కులానికి చెందిన వారికే అవకాశాలు వస్తాయన్న విషయం బహిరంగ రహస్యం. ఆ రోజుల్లో ఆంధ్ర  ప్రదేశ్ ముఖ్యమంత్రులు సంజీవ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, చెన్నా రెడ్డి. అప్పట్లో ఒక సారి పండిట్ జవహర్లాల్ నెహ్రు హైదరాబాద్ కు వచ్చాడు. అప్పటి ముఖ్యమంత్రి ఒక రెడ్డి కులానికి చెందిన వ్యక్తి, ఎయిర్ పోర్ట్ లో ఆయన  తన మంత్రులందరినీ నెహ్రు గారికి పేరు పేరునా పరిచయం చేసాడు. ఆఖరి మంత్రిని పరిచయం చేయగానే, ఈయన పేరు లో రెడ్డి లేదేమిటి అని నెహ్రు గారు ప్రశ్నించారు. ఎన్నికలలో నెగ్గటానికి హిందూ ముస్లిం మత ఘర్షణలను రెచ్చగొట్టిన మర్రి చెన్నా రెడ్డి ప్రభుత్వ తీరు, ఆనాటి ప్రభుత్వ హయాంలో గూండాయిజం దెబ్బకు ప్రజలెలా భయపడేవారో నాకు నేటికీ గుర్తుంది.

కమ్మ Vs రెడ్డి

ఆ తరువాయి కాలంలో సినీ రంగంలో ప్రముఖ నటుడైన యన్.టి.ఆర్ గారు రాజకీయ ప్రవేశం చేసారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదట్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వపు సవతి తల్లి వైఖరిపై పోరాడారు. తరువాత కాలంలో ఆయన కూడా ఈ లంచగొండులతో చేతులు కలిపారు, కమ్మ కుల రాజకీయాలకు బీజం వేశారు. ఆయన చివరి రోజుల్లో జబ్బుతో ఉన్నప్పుడు చంద్ర బాబు నాయుడు గారు అధికారాన్ని తన హస్తగతం చేసుకున్నారు. ఈయన హయాంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కి చెందిన కేంద్రంగా హైదరాబాద్ ను తయారు చేసారు. చంద్ర బాబు గారు తన మిత్రుడు మురళి మోహన్ తో కలిసి ఎలక్ట్రానిక్ సిటీ వద్ద భూ కుంభకోణాలకు పాల్పడ్డారు. వీరు రైతుల వద్దనుండి తక్కువ ధరకు భూమి కొనుగోలు చేసి, ఆ తరువాత ఆ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుందని ప్రకటించి, ఆ భూములను అనేక రెట్లు ఎక్కువ ధరలకు అమ్ముకున్నారు.  ఈయన ప్రభుత్వ హయాంలో ఎక్కువ శాతం లబ్ది దారులు ఈనాడు రామోజీరావుగారిలా  కమ్మ కులానికి చెందిన వారు. అప్పట్లో వాజపేయి గారి నేతృత్వంలోని యన్.డి.ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేంద్రం నుండి చాలా నిధులు రాష్ట్రానికి ఇవ్వబడ్డాయి. ఈ డబ్బుతో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దారు, కానీ పల్లెలను మిగతా రాష్ట్రాన్ని పట్టించుకోలేదన్న అపవాదును మూట కట్టుకున్నారు. ఇలా తెలంగాణాను అక్కడి ప్రజలను, వారి అవసరాలను పట్టించుకోకుండా నిధులను మళ్లించడం వల్ల అక్కడి ప్రజలలో అసంతృప్తి మొదలైంది, ప్రత్యేక తెలంగాణా కావాలన్న ఆలోచన మొదలైంది.

ఆ తరువాత ఎన్నికలలో యెడుగూరి సందింటి (శామ్యూల్ ?) రాజశేఖర రెడ్డి విజయం సాధించారు. ఈయన ఒక కరడు కట్టిన ఎవాంజెలికల్ క్రైస్తవ మద్దతుదారుడు. ఈయన కేంద్రంలో ఉన్న సోనియా గాంధీ తో కలిసి 3% కన్నా తక్కువగా ఉన్న క్రైస్తవుల సంఖ్యను 22% పైగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు. విదేశాల నుండి వచ్చిన అనేక క్రైస్తవ మెషినరీలకు తన ప్రభుత్వ అండదండలు అందేలా చేసి  కోట్ల మందిని క్రైస్తవమతంలోకి మార్చారు. ఈయన హయాంలో పరిస్థితి ఎలా తయారైందంటే, ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో క్రైస్తవులు లేక పోయినా కూడా చర్చ్ లు నిర్మించబడ్డాయి. ఇంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు  ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హిందూ దేవాలయాలకు చెందిన భూములను అక్రమంగా తన పరం చేసుకున్నారు. ఇంతలో హఠాత్తుగా రాజశేఖర రెడ్డి గారు మరణించారు. తిరుపతి కి చెందిన ఏడుకొండలు విడతీసి  క్రైస్తవులకు కట్టబెట్టే ప్రయత్నం చేసినందుకు ఆ వెంకన్న విధించిన  శిక్ష వల్ల  ఆయన చనిపోయారని అనేకమంది హిందువులు విశ్వసించారు. ఆ తరువాత కాలంలో రాష్ట్రం  రెండు ముక్కలైంది, 2014 లో మోడీ తో చేతులు కలిపిన చంద్ర బాబు అధికారంలోకి వచ్చాడు.

అభద్రతా భావంతో కూడిన చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాగానే కుల రాజకీయాలకు తెరతీశాడు. ఈ నేపథ్యంలో బీజేపీ తో గొడవ పడి కాంగ్రెస్ తో చేతులు కలిపాడు. కాంగ్రెస్ వ్యతిరేకతే తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి కారణం. అలాంటి కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలపడం వల్ల  అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు, తెలుగు దేశం పార్టీ యొక్క అస్తిత్వాన్నే ప్రమాదంలోకి నెట్టాడు. కేంద్రంలో నరేంద్రమోడీ గురించి తప్పుడు వ్యాఖ్యలకు, తప్పుడు ప్రచారాలకు పాల్పడ్డాడు. మీడియా లో ఉన్న తన కమ్మ కులానికి చెందిన మిత్రులకు డబ్బులిచ్చి అబద్దాలు ప్రచారం చేయించాడు. కేంద్రానికి చెందిన స్కీమ్ లకు పేర్లు మార్చి తన పార్టీ కు సంబంధించిన పేర్లు పెట్టాడు. ఇంతా చేసి ఎన్నికలలో ఓటమి పాలై వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని సమర్పించుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.సి.ఆర్  మొదట్లో చాలా తెలివిగా ప్రవర్తించినా, రాను రాను ముస్లిం మైనారిటీ రాజకీయాలకు పాల్పడటం మొదలు పెట్టాడు. 2019 లో మోడీని ఓడించే దిశగా మూడో ఫ్రంట్ కూటమి తయారు చేసి తద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని వ్యూహం పన్నాడు. శ్రీరాముడిని నిందించినందుకు ఆక్షేపించిన ఒక హిందూ సన్యాసిని నగర బహిష్కారానికి గురిచేశాడు, తన పార్టీ వారు ఎన్నికలలో పదే  పదే హిందూ దూషణకు పాల్పడినా పట్టించుకోలేదు సరికదా తాను కూడా తక్కువతినకుండా హిందూ దూషణకు పాల్పడ్డాడు.

సోషల్ మీడియాలో అనేకమంది యువకులు వారి కులాలకు ఇచ్చే మద్దతు ఆశ్చర్యంగొలుపుతోంది.

ఇది ఆంధ్రాలో తెలుగు ప్రజల దయనీయ స్థితికి నిదర్శనం. అనేకమంది రాజకీయ నాయకులు కుల, మత వర్గాలను తయారు చేసి ఆ వర్గాలకు తాయిలాలు ఇస్తూ వోట్ బ్యాంకులు తయారు చేసుకుంటున్నారు. మిగతా ప్రజలను పట్టించుకోవడం లేదు సరికదా సామాన్య ప్రజలకోసం కేటాయించబడ్డ ప్రభుత్వ ధనాన్ని రకరకాల పద్దతులలో లూటీ చేస్తూ తాము ధనికులవుతున్నారు. రాష్ట్రంలో పేదవారికి నిలువ నీడ లేకుండా పోతుంటే, ఈ రాజకీయ నాయకులు మాత్రం పెద్ద పెద్ద బంగళాలు, అట్టహాసాలు, ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన హైదరాబాద్, బెంగుళూర్ బంగళాలకు చెందిన కొన్ని వీడియోలు  ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఉన్న హంగులు, సంపదలు  అమెరికాలోని కాలిఫోర్నియా వంటి అతి ఖరీదైన ప్రాంతాలలో కూడా ఉండవు. ఈ రెడ్డి, కమ్మ కులాలకు చెందిన కొన్ని కుటుంబాలు అన్ని రాజకీయ పార్టీలలో దూరిపోయాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా  ఆ అధికార చక్రం ఈ కుటుంబాల చేతిలోనే ఉంటుంది, ఈ కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. ఈ కుటుంబాలకు వారి కులాల ప్రజల మద్దతు ఉంది, కానీ వీరు అధికారంలోకి రాగానే దోచుకునే సొత్తు మాత్రం మొత్తం ఆంధ్రా ప్రజలకు చెందినది.

పేద వారి సొమ్ము దోచుకుతింటూ, వారిని ఉద్ధరిస్తున్నామన్నట్టు భావించే ఈ రాజకీయనాయకులు నిజానికి  ఆధునిక హై టెక్ దొంగలు మరియు ఆర్ధిక నేరస్తులు. కాంగ్రెస్ పార్టీ తమ దోపిడీ రాజకీయాలతో గత 70 సంవత్సరాల పాలనలో 1.2 బిలియన్ మందిని  పేదరికంలోకి నెట్టేశారు. దేశంలో సగం మంది పిల్లలు  మాల్ న్యూట్రిషన్ కు గురవుతున్నారు. ప్రపంచంలోని పేదవారిలో   మూడవ వంతు మంది  భారతదేశంలో ఉన్నారు. చైనా 3 దశాబ్దాల కాలంలో 1 బిలియన్ పైగా ప్రజలను పేదరికంలోనుండి బయటకులాగగలిగింది. భారతదేశం మాత్రం ఈ రాజకీయ ఆర్ధిక దొంగల దెబ్బకు కుదేలయిపోయింది. 50 కోట్లమందికి పైగా అగ్గి పెట్టెల లాంటి ఇళ్ళలో, టాయిలెట్ లేకుండా దుర్భర జీవనం గడుపుతున్నారు. ఇదే సమయంలో ఈ రాజకీయ నాయకుల కుటుంబాలు మాత్రం విలాసాలతో కూడిన జీవనం గడుపుతూ దోచుకున్న సొమ్ముతో మళ్ళీ ఎన్నికలలో పోటీ చేస్తూ, ఓట్లు కొనుక్కొంటూ తిరిగి అధికారంలోకి వచ్చి  తమ దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నికలలో గెలవడానికి రాజకీయ వ్యూహకర్తలను కూడా అద్దెకు తెచ్చుకుంటున్నారు ఈ ఆధునిక హై టెక్  రాజకీయ వేత్తలు.

నాకు  తెలిసిన సమాచారం మేరకు, నేటికీ ఆంధ్రాలో ప్రతి చిన్న పిల్లవాడికి తన కులం గురించిన గాఢమైన అవగాహన ఉన్నది. సోషల్ మీడియాలో అనేకమంది యువకులు వారి కులాలకు ఇచ్చే మద్దతు ఆశ్చర్యంగొలుపుతోంది. రెడ్డి కులానికి చెందిన ఒక యువకుడు, మత మార్పిడులు, ఆర్ధిక నేరాలు వంటి వై.ఎస్.ఆర్  చేసిన దారుణాలను సమర్ధిస్తూ మాట్లాడటం చూసి నివ్వెరపోయాను. మత మార్పిడులు వంటి విషయాలలో  జగన్మోహన రెడ్డిని వెనకేసుకు రావడం చూసి ఈ కుల ప్రభావ తీవ్రత నాకు అర్ధమైంది. అనేకమంది రెడ్డి కులానికి చెందిన యువకులు తమకు జగన్మోహన్ రెడ్డికి ఏ బంధుత్వము లేకున్నా  జగన్ ని అన్నా అని సంబోధిస్తున్నారు.  రెడ్డి కులానికి చెందిన నాయకులు చేసిన ఏ దారుణాలనైనా ఈ యువకులు వినిపించుకునే పరిస్థితిలో లేరు. ఈ నాయకులు ఏ పార్టీ కి పనిచేస్తున్నా పట్టించుకోవటం లేదు, కేవలం తమ కులపు వాడా  కాదా అని మాత్రమే చూస్తున్నారు. కమ్మ కులానికి చెందిన కొంత మంది హిందూ కార్యకర్తలైతే మోడీ ఆంధ్రకు న్యాయం చేయలేదు కాబట్టి అతనిని ఓడించాలి అనే ఆలోచనలో ఉన్నారు. కుల రాజకీయాలకోసం కాంగ్రెస్ వంటి అవినీతి పార్టీని అధికారంలోకి తెచ్చి దేశం నాశనమైనా సరే మోడీ ని ఓడించాలి అనే ఆలోచించారు కానీ, తమ కులాభిమానం వల్ల  దేశం నాశనం అవుతుంది అన్న గొప్ప సత్యాన్ని విస్మరించారు. ఈ సగటు కమ్మ హిందూ కార్యకర్తలకు మోడీ ఆంధ్రకు నిధులు ఇవ్వకపోవడం వల్ల  అమరావతిలో కమ్మ కులానికి చెందిన అనేకమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు నష్టపోయారు అన్న బాధ తీవ్రంగా ఉన్నది.  కొంత మంది రెడ్డి లీడర్లు మోడీ తో చెప్పిన మాటల వల్లే చంద్రబాబుతో విభేదాలు వచ్చాయనే  ఉద్దేశంతో ఉన్నారు ఈ  కమ్మ హిందూ కార్యకర్తలు.

ఈ కులాభిమానం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు, ఇది అన్ని ఖండాలకు వ్యాపించింది. ఉత్తర అమెరికా ఖండంలో తెలుగు వారు  కులాల వారీగా తానా,నాట్స్, ఆటా, బాటా, టాటా … వంటి అనేక గ్రూప్ లు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ స్థిరపడ్డ తెలుగువారి పిల్లలు మాత్రం తమ తల్లితండ్రులలా ఉండటం లేదు. 50% మంది పైగా తెలుగువారి పిల్లలు కులాంతర, మతాంతర వివాహం చేసుకుంటున్నారు. ఈ గ్రూప్ లకు చెందిన తెలుగువారు ప్రతి సంవత్సరం కోట్లు ఖర్చు పెట్టి అనేకమంది రాజకీయ నాయకులను  అమెరికాలో పర్యటించేలా చేస్తున్నారు. ఈ రాజకీయనాయకులేమో వీరిని తమ అవసరంకోసం వాడుకుంటున్నారు. భారతదేశం ఈ ప్రవాస భారతీయులకు ఉచిత విద్య, కుటుంబం, క్రమ శిక్షణ వంటివన్నీ ఇచ్చింది. ఇవి ఉపయోగించుకొని వీరు అమెరికా లాంటి విదేశాలలో ఉన్నత స్థితికి చేరుకున్నారు బాగా డబ్బు గడించారు. ఇంతటితో తృప్తి  చెందని వీరు, తమ కులాన్ని, అవినీతి పరులైన ఈ రాజకీయనాయకులను అడ్డం పెట్టుకొని, భారతీయ పేద ప్రజల వద్దనుండి ఇంకా డబ్బు దోచుకోవాలనే ఆశలో ఉన్నారు. ఇది ఎలా ఉందంటే అన్నీ ఇచ్చిన కన్నతల్లి నే దోచుకున్నట్లు ఉంది.

అమెరికా వంటి దేశంలో ఒక హిందువుకు యూదులతో, క్రైస్తవులతో సమానంగా హక్కులు లేవు. అమెరికాకు చెందిన అనేక విద్యాలయాలలో ఆసియాకు చెందిన విద్యార్థుల అడ్మిషన్ల వద్ద నుండీ అనేక రకాల వివక్షకు గురవుతున్నారు. అమెరికా విద్యాలయాలలో హిందువుల గురించి అనేకరకాల అబద్దాలను, వక్రీకరించిన విషయాలను బోధిస్తున్నారు, దీనివల్ల ఇక్కడ ఉన్న హిందూ విద్యార్థులు తమ మతం గురించి, తమ గురించి ఒక రకమైన  ఆత్మన్యూనతా భావంతో ఉన్నారు. తక్కువ మంది హిందువులు అమెరికాలో వోట్ రెజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. ముస్లిములతో పోల్చినప్పుడు హిందువుల వోటింగ్ శాతం అతి తక్కువ, అమెరికాలో రాజకీయ ప్రాబల్యం హిందువులకు బాగా తక్కువ, ఈ కారణాల వల్ల అమెరికా రాజకీయనాయకులు హిందువులను పెద్దగా పట్టించుకోరు. అమెరికాలో మొదటి తరం హిందువులు వారి శ్రమ వల్ల, విజ్ఞానం వల్ల  సంపదను పొందగలిగారు, ఇది కలకాలం ఉంటుంది అనుకోవడం ఒక భ్రమ. రాబోయే తరాలకు ఈ విజయాలు దక్కే అవకాశాలు బాగా తక్కువవుతున్నాయి. ఆంధ్రాలో కుల ఆధారిత వివక్షను ప్రోత్సహించే ఈ తెలుగు వారు, అమెరికాలో వారి పిల్లల పట్ల జరుగుతున్న జాత్యహంకార  వివక్షను ఏ మొహంతో అడ్డుకోగలరు?

బీజేపీ- జాగ్రత్తగా పావులు కదపాలి

ఆంధ్రా రాజకీయ నాయకులతో బీజేపీ అతి జాగ్రత్తగా వ్యవహరించాలి.  ఆంధ్రాలో రెడ్డి/ కమ్మ కులాలకు చెందిన వారికే అనేక పదవులు దక్కడం నేను గమనిస్తున్నాను. జైట్లీ గారు చెప్పినట్లు ఆంధ్రాలో అన్ని కులాలకు చెందిన వారు ప్రాతినిధ్యం వహించేలా మోడీ మరియు అమిత్ షా లు జాగ్రత్తలు తీసుకోవాలి. కమ్మ కులానికి చెందిన పురందేశ్వరి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, అందువల్ల ఆమెను  ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవలసిన అవసరం లేదు. నాయకులు/ అభ్యర్థుల ఎన్నికలో సత్తా ప్రధానంగా చూడవలసిన అంశం, కులం కాదు. ఆంధ్రా బీజేపీ రెడ్డి మరియు కమ్మ నాయకులు వారి కులాల నుండి మిగతా నాయకులను/అభ్యర్థులను పార్టీ లోకి తీసుకు వచ్చే విషయంలో బీజేపీ ఆచి తూచి వ్యవహరించాలి. అనేకమంది ఆంద్ర బీజేపీ నాయకులు మిగతా పార్టీ నాయకులతో వ్యాపారాలలో  కుమ్మక్కయ్యి, సొంత లబ్ది కోసం రాష్ట్రంలో బీజేపీ ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని  క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కొంతమంది  కార్యకర్తలు వెల్లడించారు.

బీజేపీ మొదటి సారి లోక్ సభ ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు కేవలం రెండు సీట్లు వచ్చాయని నాకు చెప్పారు. ఒక సీట్ ఆంధ్రాలో (పి .వీ. నరసింహ రావు గారిని ఓడించి), మరొక సీట్ గుజరాత్ లో. గుజరాత్ లో ఒక్క సీట్ గెలిచిన బీజేపీ నేడు భారతదేశాన్ని పాలిస్తోంది, ఆంధ్రాలో  మాత్రం దీన స్థితిలో ఉంది. దీనికి కారణం ఆంధ్ర బీజేపీ నాయకులు పార్టీ ప్రయోజనాలకన్నా సొంత ప్రయోజనాలు, కుల రాజకీయాలకు పెద్ద పీట వేసి అధికార పార్టీ తో కుమ్మక్కవ్వడమే.  ఒక వేళ ఆంధ్ర /తెలంగాణాలో బీజేపీ తన పార్టీ ను బలోపేతం చేయాలనుకుంటే, మొత్తం క్యాడర్ ని తప్పని సరిగా ప్రక్షాళన చేసి తీరాలి, కొత్త నాయకులను తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్న క్యాడర్ లో నిజంగా పని చేసే నాయకులెవరో, కుల రాజకీయాలకు పాల్పడుతూ పని చేయకుండా సొంత లబ్ది చూసుకునే నాయకులెవరో తేల్చుకొని, క్యాడర్ ని బలోపేతం చేసే విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. (ఈ ప్రక్షాళన తమిళనాడు లో కూడా చేయాల్సిన అవసరం ఉన్నదని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు).

నా ఈ వ్యాసం ఎంతో మందికి కోపాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. కానీ తెలుగు ప్రజలకు ఇది నిజాయితీగా ఆత్మ శోధన చేసుకోవలసిన సమయం. ఈ కుల పోరాటాలను అలుసుగా చేసుకొని గత 800 సంవత్సరాలు పరాయి దేశస్థులు, మతాల వారు మనల్నుపాలించారు, నేడు మరల అదే తప్పు చేస్తూ, పరాయి పాలన దిశగా అడుగులు వేస్తోంది తెలుగు సమాజం.  తెలుగు వారిలో కూడా అనేకమంది కులాభిమానం లేకుండా  నిస్వార్ధంగా సేవ చేస్తున్నారు. కాస్ట్  లేదా జాతి అనేది పుట్టుకతో వచ్చేది కాదు, మనిషి స్వభావాన్ని ఆధారం చేసుకొని సహజసిద్ధంగా వచ్చేది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలను విభజించటం కాదు, సమాజాన్ని సరైన దారిలో నడపటానికి ఉపయోగపడే ఒక వ్యవస్థ ఇది.

అమెరికా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది, అందులో వర్ణ వివక్ష అనేది ప్రధమమైనది. వారు ఈ అవలక్షణాన్ని మరుగుపరిచే ప్రయత్నం చేయకుండా, దాని గురించి సిగ్గు పడకుండా అనేక మార్లు చర్చించారు, దాని నిర్మూలన దిశగా అనేక చర్యలు చేపట్టారు. దీని ఫలితం ప్రప్రథమంగా  అమెరికాలో మిలిటరీ వ్యవస్థలో ఈ వర్ణ వివక్షను నిరోధించగలిగారు. ఈ కుల వివక్ష వల్ల  అనేక మంది మత  మార్పిడికి గురవుతున్నారు, దీనినే బూచిగా చూపించి అనేకమంది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. సమ సమాజంతో కూడిన భారతదేశాన్ని తయారు చేయాలనీ మోడీ గారు ప్రయత్నిస్తున్నారు, దానికి సహాయం చేయాల్సిన బాధ్యత తెలుగు వారందరి మీదా ఉన్నది. తెలుగు ప్రజలకు ఇదొక సువర్ణావకాశం, రండి చేయి చేయి కలపండి. రాజకీయాలలో కుల దురభిమానాన్ని రూపు మాపండి. భారత సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి.

సత్య దోసపాటిఅమెరికా లో స్థిరపడిన ఒక ప్రముఖ హిందూ కార్యకర్త. ఈయన భారతదేశానికి, అమెరికాకు చెందిన అనేక కీలకమైన విషయాలలో పని చేశారు.భారత దేశపు ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ లలో పేపర్ ప్రింట్ రావడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నికల సమయంలో అనేకమంది మైనారిటీల నుసంఘటితం చేసి ట్రంప్ కు మద్దతు తెలిపాడు. అమెరికాలో సోనియా గాంధీకి చెందిన అనేక కోర్ట్ కేసులను ఎదురొడ్డి నిలిచారు. వెస్ట్ బెంగాల్ లో అనేకమంది పేద బాలికల అపహరణ,లవ్ జిహాద్, తదనంతరంవారిని బానిసలుగా వేశ్యాగృహాలకు అమ్మేసే రాకెట్ పై పోరాటం చేసారు. ఈయన ఇచ్చిన"ప్లండర్అఫ్ ఇండియా బై సోనియా గాంధీ" అనే ప్రెజంటేషన్ ను 2 లక్షల మంది పైగా వీక్షించారు. 2007 లో హిందూ దేవాలయాలలో మత మార్పిడులను నిషేధించాలని అప్పటి ముఖ్య మంత్రి వై.ఎస్.ఆర్ ప్రభుత్వంపై పోరాటం చేసారు. అమెరికాలో జంతు హక్కులపై పోరాటం చేసారు. ఈయన ఐఐటీమద్రాస్ లో పట్టభద్రుడయ్యాడు,వృత్తి రీత్యా ప్రస్తుతం అమెరికాలో టెలికాం ఇండస్ట్రీ లో ఉద్యోగం చేస్తున్నారు.
సత్య దోసపాటి

1 COMMENT

  1. Mr. Dosapati
    Are you a kamma? I am asking this embarrassing question because you are overlooking Chandra Babu’s pro Muslim utterances in the just concluded election campaign.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here