జగన్ గారికి బహిరంగ లేఖ

భవిష్యత్తు భారతానికి మీ రాజకీయ జీవితం ఒక మంచి సోపానం కావాలనే  ఆకాంక్షతో ప్రవాస భారతీయులందరు ఉన్నారన్న విషయాన్నీ దయచేసి మర్చిపోవద్దు

జగన్ గారికి బహిరంగ లేఖ
జగన్ గారికి బహిరంగ లేఖ

ఆంధ్రాలో ఎన్నికల గెలుపు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు  ప్రవాస భారతీయులందరం జగన్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలుపుతున్నాము.  మీకు ఓటు వేసిన వారు, వేయని వారని  భేదం చూపించకుండా రాబోయే కాలంలో మీరు ఆంధ్ర  రాష్ట్రానికి చక్కటి పాలన అందిస్తారనే  ఆశను వ్యక్తం చేస్తున్నాము.  కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాలన ప్రపంచంలో భారతీయుల ప్రతిభను ఇనుముడింప చేసేలాగా అద్భుతంగా ఉంది. ఆయన పాలన ద్వారా  భారతదేశం  పునర్వైభవం దిశగా ప్రయాణం మొదలు పెట్టింది.  ప్రాచీన భారతదేశపు సాహిత్య, కళా, సాంస్కృతిక సంపదలను తిరిగి పొందడానికి ఈ చక్కటి  పాలన దోహద పడుతుంది.  నరేంద్ర మోడీ గారి లాగానే మీ పాలన కూడా ఆంధ్ర ప్రజలను మరియు భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఉంటుందని భావిస్తున్నాము.

మీ తండ్రిగారు అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధికి అత్యద్భుతంగా పాటుపడ్డారు.  మీరు కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వారి అభివృద్ధికి పాటుపడాలని ఆశిస్తున్నాము. గతం లో హిందూ మతానికి సంబంధించిన కొన్ని విషయాలలో  మీరు  మరియు  మీ నాన్నగారు వై.ఎస్.ఆర్ గారి జోక్యం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది తెలుగు ప్రజలకు ఇబ్బంది కలిగించింది. మీ నాన్నగారు ముఖ్య మంత్రిగా ఉన్న రోజులలో ఆయన క్రైస్తవ మిషనరీలకు మద్దతుగా ఉండేవారన్న విషయం బహిరంగ రహస్యం. ఆయన పాలనా కాలంలో ఆంధ్రలో దాదాపు 20% మంది ప్రజలు క్రైస్తవం లోకి మతం మార్చ బడ్డారు. ఇది కేవలం  5 నుండి 6 సంవత్సరాల కాలంలో జరిగింది.

భవిష్యత్తు భారతానికి మీ రాజకీయ జీవితం ఒక మంచి సోపానం కావాలనే  ఆకాంక్షతో ప్రవాస భారతీయులందరు ఉన్నారన్న విషయాన్నీ దయచేసి మర్చిపోవద్దు.

విదేశీయుల ద్వారా నిర్వహించబడిన అనేక క్రైస్తవ మత సభలలో లక్షల మంది మతం మార్చబడ్డారు. దీనికి తోడుగా మీ సోదరి మరియు బావగార్లు చేసిన మత ప్రచారాలకు మీ నాన్నగారి నేతృత్వంలోని ప్రభుత్వం  మద్దతు ఇచ్చింది. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను కలవర పరచింది. హిందువుల గుడులకు చెందిన భూములలో 40% భూములను రియల్ ఎస్టేట్ దళారులకు తక్కువ ధరలకు కట్టబెట్టారు,  గుడులకు చెందిన భూములలో చర్చిలు నిర్మింపచేశారు.

ఈ మధ్య కాలంలో మీ సోదరి షర్మిల కు చెందిన వీడియో ఒకటి వాట్సాప్ లో వైరల్ అయింది, దాని సారాంశం మేరకు మీరు జీసస్ వార్తను విశృంఖలంగా తీసుకు వస్తున్నారని ఆమె అన్నది. ముఖ్య మంత్రి స్థానం లో ఉన్న మీరు మత సామరస్యాన్ని పాటించాలి. కానీ మీ సోదరి వ్యాఖ్యలు ఆ సామరస్యానికి వ్యతిరేకంగా ఉంటూ  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మీరు  అధికారంలోకి వచ్చాక  క్రైస్తవ పాస్టర్లకు ఇల్లు కట్టిస్తామని, క్రైస్తవ వధువులకు వివాహం చేయిస్తామని అన్నారు, వీటికి ప్రభుత్వ ధనాన్ని వాడటం ఎంతవరకు సమంజసం?  ప్రజా పన్నుల ద్వారా వచ్చిన ధనాన్ని ఇలాంటి మత రాజకీయాలకు వాడటం ఎంత వరకు సమంజసమైన విషయం ?  ఇంత కన్నా పెద్ద ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, కేవలం హిందువుల గుడులు మాత్రమే ప్రభుత్వ పరిధి లో ఉన్నాయి, ఆ గుడులపై వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్స్ పేరిట క్రైస్తవ పాస్టర్లకు ఖర్చు చేయడాన్ని  మీరెలా సమర్ధించుకోగలరు ? హిందూ పూజారులకు, అర్చకులకు సంబంధించిన వ్యవహారాలలో ప్రభుత్వ మితి మీరిన జోక్యం, మరియు ఎంతో మంది అర్చకులు  జీత భత్యాలు లేక దిక్కు తోచని పరిస్థితి లో ఉంటె మీరు హిందువుల డబ్బులతో క్రైస్తవ పాస్టర్లకు తాయిలాలు ఇస్తామనడం ఎమన్నా బాగుందా ?1993 నుండి నేటి వరకు హిందువుల గుడులకు సంబంధించిన  ఆదాయపు లెక్కలు ఇంకా తేలలేదు. తిరుమల గుడిలో ప్రతి రోజు ఎంత బంగారం వస్తుందో, అసలు ఎంత బంగారం ఉందొ ఎవరికీ తెలియదు. భక్తులు వేసిన బంగారంలో 60% తరుగు చూపిస్తున్నారని, ఆభరణంలో ఉన్న విలువైన రాళ్ళ మరియు వజ్రాలకు లెక్కలు చూపించడం లేదనే అభియోగాలు అనేకం ఉన్నాయి.

క్రైస్తవులకు విదేశాలనుండి గత 200 సంవత్సరాలుగా నిధుల ప్రవాహం సాగుతోంది అనేది బహిరంగ రహస్యం. ఈ నిధులతో అనేకమంది ప్రజలను మత మార్పిడి చేస్తున్న వారికి మీరు మీ ప్రభుత్వ మద్దతు, ఆర్ధిక మద్దతు ఇస్తే ఇక వారికి అడ్డు ఉండదు.

మీ నాన్నగారి పాలనా కాలంలో తిరుమల 7 కొండలలో 5 కొండలను విడతీసే  ప్రయత్నం జరిగింది, ఇదే కాకుండా అనేకమంది క్రైస్తవ మిషనరీలకు చెందిన పాస్టర్లు తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. టీటీడీ లో  అనేకమంది క్రైస్తవులకు ఉద్యోగాలివ్వబడ్డాయి, ఇంతే కాకుండా అనేకమంది పక్కా క్రైస్తవులకు తిరుమల గుడి నిర్వహణలో కీలకమైన పదవులు ఇవ్వబడ్డాయి.  ఒక పక్క కెమెరా ముందు మీ అమ్మ గారు, నాన్నగారు శ్రీ రామ నవమి  శుభాకాంక్షలు చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సెలవు దినాల  లిస్ట్ నుండి రామ నవమిని తొలగించారు. అదే చేత్తో కేవలం కొద్ధి  సంఖ్యలో ఉన్న  క్రైస్తవులకు ప్రభుత్వ  సెలవు  దినాలను పెంచారు. 2007 లో మీ నాన్నగారు అమెరికాలో  పర్యటించి నప్పుడు అనేక మంది ప్రవాస భారతీయులు చికాగోలో ఈ  నిర్ణయంపై నిరసన తెలిపారు.
క్రైస్తవులైన మీరు 2012 లో తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకుండా గుడిలో ప్రవేశించారన్న వార్త సంచలనం సృష్టించింది. అలానే మీరు  మీ నాన్నగారి వద్ద పనిచేసిన  స్టీఫెన్ రవీంద్ర అనే ఐ పి ఎస్  అధికారిని  ఆంధ్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించాలనుకుంటున్నారు. ఈయన ఒక పక్కా క్రైస్తవ వాది  అన్న విషయం జగద్విదితం. ఈయన రాష్ట్రంలో విచ్చల విడి మత మార్పిడులను ప్రోత్సహిస్తారని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈయన నియామకంలో ఆచి తూచి అడుగు వేస్తుందని మేము భావిస్తున్నాం.

మీ ప్రభుత్వం వచ్చిందని రాష్ట్రంలో అనేక క్రైస్తవ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మీరు వారికి ప్రత్యక్షం గానొ  లేక  పరోక్షంగానో మద్దతుఇస్తారని, ఇక పై విచ్చల విడిగా అమాయకపు హిందువులను మతం మార్చొచ్చనే ఆలోచనలో  కొన్ని మిషనరీలు ఉన్నాయి. మీరు ఎన్నికల ప్రచార సమయంలో అనేకమంది హిందూ గురువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు, మీకు అనేకమంది హిందువులు ఓట్లు వేశారు, కానీ మీ మానిఫెస్ట్లో లో కేవలం క్రైస్తవులకే   తాయిలాలు  ఇవ్వడమనే అంశం వివాదాస్పమైనది. ఇది  చట్ట రీత్యా కూడా నేరం .

ఆంధ్ర ప్రజలను పాలించడానికి మీకు లభించిన ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాము. భారతీయ ప్రతిభని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పడంలో తెలుగు వారి కృషి అమోఘం. మనం ఇకనన్నా  ఈ కాస్ట్  రాజకీయాలనుండి దూరం జరుగుదాం.  తెలుగు వారంటే కేవలం రెడ్డి కులానికి చెందిన వారు కారు. మీ నాన్నగారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో నియమించబడిన వారు ఎక్కువ మంది రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారే.  మీకు కేవలం రెడ్డి కులానికి చెందిన వారే వోట్ వేయలేదు.  మీరు అధికారంలో కి రావడానికి మిగతా కులాల వారు కూడా ఓట్లు వేశారన్న విషయం మీకు గుర్తుంటుందని భావిస్తున్నాం.

యోగులు జన్మించిన కులం

వేమన లాంటి యోగులు జన్మించిన కులం రెడ్డి కులం. రెడ్డి కమ్యూనిటీలో, క్రైస్తవ కమ్యూనిటీలో అనేక మంది మంచి వ్యక్తులున్నారు. కానీ మీకు ఎన్నికల ముందు మద్దతు ఇచ్చామనే సాకుతో మీ దగ్గరనుండి తిరుగు సాయం పొందాలని అనేకమంది దురాశతో ఉన్నారు. మీరు కుల, మత భావనతో కాకుండా  మీకు ఓట్లు వేసిన అన్ని కులాల రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారని, రాష్ట్ర ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయరని భావిస్తున్నాం.

ఎన్నికల రిజల్ట్ రాగానే అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అందులో అనేకమంది ఆకతాయిలు  రామారావు గారి విగ్రహానికున్న దండలు పీకేస్తూ, విగ్రహాలను నాశనం చేస్తూ వీడియోలు పెట్టారు. ప్రస్తుతపు డిజిటల్ యుగంలో ప్రతి చిన్న విషయం క్షణాలో ప్రపంచాన్ని చుడుతున్న విషయం మీకు తెలియంది కాదు.  అలాగని ఎవరికీ తెలియకుండా ధాష్టీకం చేయమని కాదు. ప్రస్తుత యుగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది, అమెరికాలాంటి దేశాలలో ఒక పోలీస్ సుప్రీమ్ కోర్ట్ జడ్జి  మీద కూడా చర్య తీసుకోగలడు, కానీ భారత దేశంలో అది జరగడం కలలో మాట. కనీసం మీరైనా, ఈ విషయంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం నిష్పక్షపాతంగా  రాష్ట్రంలో  చట్టాన్నీ, శాంతి భద్రతలను పరిరక్షిస్తారని భావిస్తున్నాం.

జగన్ గారు! ప్రపంచ చరిత్రలో ఆంధ్రుల చరిత్ర అమోఘమైనది. శాతవాహనుల పాలన, ఇస్లామిక్ దండయాత్రలు తిప్పికొట్టిన 350 సంవత్సరాల శ్రీకృష్ణ దేవరాయల పాలన,  బ్రిటిష్ వారి దోపిడీ పై తిరగబడ్డ అల్లూరి సీతారామ రాజు గారు వంటి వారు పుట్టిన గడ్డ మనది. టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి నాయకులు జన్మించిన నేల మనది.  యోగ వంటి విద్యలు, అమోఘమైన వైజ్ఞానిక విషయాలు భారతదేశంలోనే పుట్టాయి.  క్రైస్తవుల మత గ్రంధమైన బైబుల్ లో కూడా తూర్పు దిక్కున ఉన్న మేధావుల గురించి ప్రస్తావన ఉన్నది. జీసస్ జీవితంలో 14 సంవత్సరాలు భారతదేశంలో ఒక విద్యార్థిగా  గడిపాడు అని ఎంతోమంది విశ్వసిస్తారు. కానీ ఈ క్రైస్తవ మిషనరీలు కేవలం భారతదేశాన్ని యూరోప్ నుండి పాలించాలనే దురుద్దేశంతో ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రజలను పెద్దఎత్తున మతం మారుస్తున్నారు.  భారత జాతి పితగా భావింపబడే మహాత్మాగాంధీ కూడా ఈ క్రైస్తవ మిషనరీలు తీవ్రంగా వ్యతిరేకించాడు , ఈ విషయాన్ని ఆయన రాసిన అనేకమైన లేఖలలో మనం గమనించవచ్చు.  ఈ క్రైస్తవ మిషనరీల కుటిల పన్నాగాలను ఆయన ఏనాడో గుర్తించాడు. ప్రస్తుత పరిస్థితులలో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే తలంపుతో, అమెరికా, యూరోప్ కేంద్రంగా అనేక క్రైస్తవ మిషనరీలు పని చేస్తున్నాయి.  క్రైస్తవులను, హిందువులను కలుపుతూ ఆంధ్ర సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగే మహత్తర అవకాశం మీకు వచ్చింది. దానికి ఒక పరిష్కారం జీసస్ ను ఒక హిందూ అవతారంగా గుర్తిస్తే రెండు మతాలు ఒకటవుతాయి.

ఆంధ్ర రాష్ట్రపు భవిష్యత్తును నిర్దేశించే కూడలిలో మీరున్నారు. ఆధునికయుగంలో సరికొత్త ఆంధ్రను తయారుచేసే మహత్తర అవకాశం మీ చేతులలో ఉంది. దీనిని ఆంధ్ర  రాజ్యంగా చేస్తారో లేక మిషనరీ రాజ్యంగా చేస్తారో మీ చేతలే నిర్ణయిస్తాయి. ఈ రెండే కాకుండా రెడ్డి రాజ్యం లేదా రౌడీ రాజ్యం అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి . వీటన్నింటిలో ఆంధ్ర రాజ్యం కాకుండా వేరేది ఏది వచ్చినా ఆంధ్రా  పతనం తప్పదు.

భవిష్యత్తు భారతానికి మీ రాజకీయ జీవితం ఒక మంచి సోపానం కావాలనే  ఆకాంక్షతో ప్రవాస భారతీయులందరు ఉన్నారన్న విషయాన్నీ దయచేసి మర్చిపోవద్దు.

సత్య దోసపాటిఅమెరికా లో స్థిరపడిన ఒక ప్రముఖ హిందూ కార్యకర్త. ఈయన భారతదేశానికి, అమెరికాకు చెందిన అనేక కీలకమైన విషయాలలో పని చేశారు.భారత దేశపు ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ లలో పేపర్ ప్రింట్ రావడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నికల సమయంలో అనేకమంది మైనారిటీల నుసంఘటితం చేసి ట్రంప్ కు మద్దతు తెలిపాడు. అమెరికాలో సోనియా గాంధీకి చెందిన అనేక కోర్ట్ కేసులను ఎదురొడ్డి నిలిచారు. వెస్ట్ బెంగాల్ లో అనేకమంది పేద బాలికల అపహరణ,లవ్ జిహాద్, తదనంతరంవారిని బానిసలుగా వేశ్యాగృహాలకు అమ్మేసే రాకెట్ పై పోరాటం చేసారు. ఈయన ఇచ్చిన"ప్లండర్అఫ్ ఇండియా బై సోనియా గాంధీ" అనే ప్రెజంటేషన్ ను 2 లక్షల మంది పైగా వీక్షించారు. 2007 లో హిందూ దేవాలయాలలో మత మార్పిడులను నిషేధించాలని అప్పటి ముఖ్య మంత్రి వై.ఎస్.ఆర్ ప్రభుత్వంపై పోరాటం చేసారు. అమెరికాలో జంతు హక్కులపై పోరాటం చేసారు. ఈయన ఐఐటీమద్రాస్ లో పట్టభద్రుడయ్యాడు,వృత్తి రీత్యా ప్రస్తుతం అమెరికాలో టెలికాం ఇండస్ట్రీ లో ఉద్యోగం చేస్తున్నారు.
సత్య దోసపాటి

4 COMMENTS

  1. Why do u bring caste in everything why can’t u think what he said before commenting Mr hindu nationalist. U are a kamma hater I pity u

  2. Just today Jagan sought blessings of Swaroopananda in Vizag. This writer is just fear mongering. May be he likes Chandra Babu due to his caste affiliation. He needs to come out clean on this.

  3. All Christians & Muslims who are Indian citizens living in Indian should respect India. Even in there are several caste & comunity in Hindus. Whether it is Prime Minister or chief Minister is for the counter and state. Every person has responsibility towards Nation. All are INDIANS. Let every person worship any God or there GURU as pet their wish and will in their home. Let them not bring to street and create conflict by which giviig scope for other countries to create enimity among ourselves. If Nation has to be developed Uninity among ourselves is impotant. Politicians should not take advantage of the caste and creed. Growth and well being of the States and Nation is important. We are all INDIANS and we are all ONE.
    Let us not continue the path which will spoil the development of Nation. Every country is intersted in development of their Nation. Internal fight is more dangerous than external fight. Our Country has given birth to great people, we have respect the great values of them. After Independence our development rate is slow compare to other countries. Pl concentrate on development of Nation. Politcal advantage will spoil the development.
    Regards

  4. There is every possibility of activating evangelical activities with support from govt and finds from hindu temples.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here